జనగామ, మార్చి 26(నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన జనగామలో మహిళా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన రోజురోజుకూ విస్తరిస్తున్న జిల్లా కేంద్రంలో మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పంటలు ఎండిపోయినయ్ అని వాట్సాప్ వీడియోల్లో మాట్లాడితే రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారన్నారు. ఇటీవల తాను జనగామలో జైలును సందర్శిస్తే ఖైదీలు 40 మంది ఉంటే.. దాంట్లో 23 మంది కేవలం పంటలు ఎండిపోయాయని వీడియోల్లో మాట్లాడిన రైతులే ఉన్నారంటే కాంగ్రెస్ నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనం అని అన్నారు.