Bhupalapally | రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జూబ్లీ నగర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాళ్ల పెళ్లి రాములు శుక్రవారం రాత్రి తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందాడు. వృత్తిరీత్యా రాములు తాడిచెట్టు ఎక్కి కిందికి దిగే క్రమంలో మోకు జారి ప్రమాదవశాత్తు కింద పడడంతో రాములు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీతా కార్మిక సంఘం నాయకులు కోరారు. మృతుడు రాములు నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.