కృష్ణకాలనీ, అక్టోబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన (100 పడకల) ఆస్పత్రి రోగులకు శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఆస్పత్రిలోని గర్భిణులకు ఆపరేషన్ చే సే వార్డును పరిశీలించగా డాక్టర్లు లేక సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. తాను వెళ్లిన తర్వాత డాక్టర్లు వచ్చారని మండిపడ్డారు. గర్భిణులకు కుర్చీలు వేయాలని తాము అడుగగా సిబ్బంది దాటవేసే ధోరణిలో సమాధానాలు చెప్పడం సరైనది కాదన్నారు. ఆస్పత్రి చుట్టూ చెత్తాచెదారంతో నిండి ఉంద ని, బయో వేస్టేజ్ కూడా ఆవరణలోనే వేస్తున్నారని, ఇది రోగులను మరింత రోగాల పాలు చేస్తుందన్నారు.
అంతేకాకుండా టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయన్నారు. సిటీ సాన్, ఎమ్మారై సాన్లు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయని, కనీసం వాటిని పట్టించుకు నే నాధుడు లేడన్నారు. ఇక్కడి నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారని, ఎప్పటికప్పుడు సమస్యలపై రివ్యూ నిర్వహించినట్లయితే 100 శాతం పరిషా రం అవుతాయని సూచించారు. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ఆసుపత్రి ఆగమైపోయిందని, బీఆర్ఎస్ పాలనలో నెలకు 250 నుంచి 300 వరకు డెలివరీలు జరిగేవని, ఇప్పుడు కేవలం 100 నుంచి 150 మాత్ర మే జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆస్పత్రి అధికారులకు, సిబ్బందికి మధ్య సఖ్యత లేక అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. సిబ్బంది ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులను బెదిరించడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికైనా ఆసుపత్రిని శుభ్రం చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవ చేస్తామన్నారు. ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అదేవి ధంగా కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించాలని సూచించా రు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్రె డ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్‌యాదవ్, ము న్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజు, నాయకులు సెగ్గం సిద్ధు, బీబీ చారి, మామిడి కుమార్, చిన్నాల ప్రవీణ్రె డ్డి, ప్రేమ్, కృష్ణమూర్తి, సతీశ్‌కుమార్, అశోక్, బాలరా జు, కుమార్‌రెడ్డి, రాజుపటేల్, దుండ్ర కుమార్, అర్బ న్ మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ పాల్గొన్నారు.
‘మెనూ ప్రకారం రోగులకు భోజనం వండుతలేరని, వంట చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదు. తినడానికి ఉపయోగపడని అరటిపండ్లు, ఉప్మాలో తెల్ల పురుగులు, బూజు పట్టిన బ్రెడ్ ప్యాకెట్లతో స్టోర్ రూమ్ దుర్వాసనతో కంపుకొడుతున్నది. టాయిలెట్స్ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై దృష్టిగా ప్రవర్తించడం ఏంటని’ సూపరింటెండెంట్‌పై గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మా ర్చుకోవాలని హెచ్చరించారు. సానింగ్ మిషన్లు తెచ్చి నెలలు గడుస్తున్నా ప్రారంభించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అలాగే మున్సిపల్ పరిధిలోని పలువురు మృతుల కుటుంబాలను గండ్ర పరామర్శించారు.