ఖిలావరంగల్, ఫిబ్రవరి 25: హాస్టల్ వెల్ఫేర్ అధికారుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ అన్నారు. మంగళవారం టీఎన్జీవోస్ భవనంలో తెలంగాణ వసతి గృహ అధికారుల సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్జీవోస్ యూనియన్ కింద అనేక విభాగాల యూనియన్లు పని చేస్తున్నాయన్నారు. ఉద్యోగ హక్కుల కోసం పోరాడే ఏకైక సంఘం టీఎన్జీవోస్ అని అన్నారు. తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ గౌస్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన మెనూను స్వాగతిస్తున్నామన్నారు.
అయితే మెనూకు సరిపోయే విధంగా ఉద్యోగులను పెంచాలన్నారు. అలాగే ఆహార పదార్థాలను టెండర్ ద్వారా సప్లయ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు గద్దెల రాజు, దుర్గారావు, వెలిశాల రాజు, రవికుమార్, సత్యనారాయణ, వీరన్న, జోసెఫ్, రేఖారాణి, ఇందిరా, కృష్ణవేణి, హరిత, స్నేలత తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సంఘం ఎన్నిక ఏకగ్రీవం
సర్వ సభ్య సమావేశం అనంతరం తెలంగాణ వసతి గృహ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా కే రవికుమార్, కార్యదర్శిగా ఎం జోసఫ్, కోశాధికారిగా ఎస్ రవీందర్, ఉపాధ్యక్షులుగా ముజాహిద్, ఎస్ ఇందిర, సతీష్‌కుమార్, సహాయ కార్యదర్శిగా రేఖారాణి, ప్రచార కార్యదర్శిగా నరేంద్రనాథ్, కార్యవర్గ సభ్యులుగా బీ హరిత, కే స్నేహలత, సీహెచ్ విజయలక్ష్మి, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని టీఎన్జీవోస్ ప్రతినిధులు సత్కరించారు.