మహదేవపూర్,జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతని మండల ఎఫ్ఆర్ఓ రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కలే జీవకోటికి ప్రాణాధారం అని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ, జిపి కార్యదర్శి కల్పన, అటవిశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.