బచ్చన్నపేట మే 7 : ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని వేద కరాటే అకాడమీ మాస్టర్ త్రివిక్రమరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు, యువకులు, బాలికలు చదువుతోపాటు కరాటే నేర్చుకోవడంతో ఆత్మ రక్షణకు, శరీరధారుడ్యానికి ఎంతో దోహదపడుతుందన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ఈ శిక్షణ ఇస్తామన్నారు.
కరాటే, జూడో ట్రిక్స్, సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్నెస్, యోగ, ప్రాణయామము, ధ్యాన పద్ధతులు, వెపన్స్ పై శిక్షణ, స్పోర్ట్స్, కర్ర సాము, సాము రాయి వంటిపై ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఆత్మ రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చిన్నప్పటి నుంచె కరాటే నేర్చుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తమకు తాము రక్షించుకోవడంతోపాటు, ఆత్మ రక్షణకు దోహదపడుతుందన్నారు. పిల్లలు మత్తు పదార్థాలు, సెల్ఫోన్లకు, చెడు అలవాట్లకు పోకుండా తోడ్పాటు అందిస్తుందన్నారు. మరిన్ని వివరాలకు 9848946191, 756 954 2392 నెంబర్లను సంప్రదించాలన్నారు.