సుబేదారి, జనవరి 31 : ఉద్యోగాల పేరిట మోసం చేసి వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై బుధవారం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన లెంకల వివేకానందరెడ్డి అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ నిట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే స్కూల్లోని ఐదుగురి టీచర్ల నుంచి రూ.21లక్షలు వసూలు చేశాడు. ఈమేరకు బాధితులు ఫిర్యాదు చేయగా బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.