బచ్చన్నపేట సెప్టెంబర్ 4 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపుర్ గ్రామంలోని సర్వీస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని అలింపూర్ మాజీ సర్పంచ్ బాల్రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న మూలమలుపును త్వరగా పూర్తిచేయాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎన్హెచ్ (డీఈ)తో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు ఆ రోడ్డులో మూలమలుపు వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని, తరచూ పైప్ లైన్లు డ్యామేజ్ అయి ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యేకు సర్పంచ్ విన్నవించారు.