కృష్ణ కాలనీ, జనవరి 5: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని, చివరకు రైతుభరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కారల్ మార్స్ కాలనీలో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 6 గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నప్పటికీ ఏ ఒకటీ అమలు చేయలేదన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలు నిర్వహించ డం లేదన్నారు.
ఇప్పటికే ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఇది స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రైవేట్ ఏజెన్సీతో చేయించిన సర్వేలో తేలిందన్నారు. దీంతో ఆయన పాలనకు తెలంగాణ ప్రజలు సున్నా మారులు వేశారని స్పష్టమైందన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్‌లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 15వేలు ఇస్తానని చెప్పి, నేడు రూ. 12 వేలు ఇస్తానని ప్రకటన చేసి రైతులను మోసం చేసిండన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగికి ఇస్తానన్న రూ. 2, 500, 2024 సంవత్సరం రూ. 15 వేలు, రైతు భరోసా ఊసే లేదన్నారు. ప్రభుత్వం రైతుకు ఎకరాకు రూ. 17,500 రైతు భరోసా కింద బాకీ పడిందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కొద్ది మందికే అయ్యిందన్నారు. రైతులకు రైతు భరోసా, పూర్తి స్థాయిలో రుణమాఫీ, సన్న, దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, మహిళలకు రూ. 2,500, రూ. 500లకే గ్యాస్, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి తులం బంగారం పథకాలను ఎప్పుడు ఇస్తారో ప్రకటించి, వాటి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు కొత్త హరిబాబు, మేకల రజిత, ఎడ్ల మౌనిక, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి రవి, గడ్డం కుమార్ రెడ్డి, ఎండీ కరీం, సింగనవేణి చిరంజీవి, కరాటే శ్రీనివాస్, కృష్ణమూర్తి, మోకిడి అశోక్, టీబీజీకేఎస్ నాయకులు సదానందం, నరేశ్ నేత, అవినాష్‌రెడ్డి, మధు, యూత్ నాయకులు శ్రీకాంత్ పటేల్, భాసర్, శ్రీరామ్ పాల్గొన్నారు.