స్టేషన్ ఘన్పూర్/ ధర్మసాగర్, జనవరి 6: వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకూ రూ.15వేలు రైతుభరోసా ఇవ్వాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా సోమవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేం ద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, ధర్మసాగర్ మండలంలో బీఆర్ఎస్ నాయకుల తో కలిసి ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ ఆధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు రూ.15వేలు రైతుభరోసా ఇస్తామని చెప్పిందని, నేడు మాటమా ర్చి రూ.12వేలు ఇస్తామని రైతులను మో సం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు పో రాటం ఆగదని హెచ్చరించారు.
కార్యక్రమా ల్లో కుడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంజిత్, పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కుంభం కుమార్, బంగ్లా శ్రీనివా స్, గుర్రం శంకర్, గాదే రాజు, గుండె రంజి త్, మారపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్, గుం డె మల్లేశ్, కర్ర సోమిరెడ్డి, లాల్, మాజీ ఎం పీటీసీలు విజయ్, శోభ, మాధవరెడ్డి, సుదర్శన్, బొడ్డు ప్రతాప్, బేరే హరీశ్, మధు, జో గు శేఖర్, భాస్కర్, అశోక్‌రెడ్డి, విజయ్, హ సీఫ్, చేరాలు, దేవేందర్, రమణాకర్, రాజ్‌కుమార్, రంజిత్‌రెడ్డి, రాము పాల్గొన్నారు.