ఇనుగుర్తి, డిసెంబర్ 6 : కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో మోసపోయామని, మ రోసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ గోసపడొద్దని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని గ్రామాల్లో శనివారం ఆయన సర్పంచ్ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. యా సంగిలో కొన్న ధా న్యానికి ఇప్పటికీ బోనస్ ఇవ్వకుండా మోసం చేసిందని, యూరియా బస్తాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తున్నదన్నారు. ఇనుగుర్తిని మండలం చేయడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు, మాజీ సీఎం కేసీఆర్‌కు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని శంకర్‌నాయక్ ఓటర్లను కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మం డల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్లు దీకొండ వెంకన్న, గుండా వెంకన్న, మాజీ ఏఏంసీ వైస్ చైర్మన్ కసిరబోయిన విజయ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.