పరకాల, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1, 10 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వతంత్ర నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో జోరుమీదుంటే, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బేజారుగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, అధికార మత్తులో ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అభివృద్ధి పేరుతో అబద్ధాలు, ప్రజలపై పన్నుల భారమే కనిపిస్తోందని, ఇక ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో పట్టణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుడు దుబాసి వెంకటస్వామి, బొచ్చు సతీశ్, దండ్ర వెంకట్, ఒంటేరు బాబురావు, కోగిల సుధాకర్, ఆదరసాండి శ్యామ్, పిట్ట స్వప్న, పిట్ట దేవేందర్, కనుకుంట్ల రఘు, రాసమల్ల సతీశ్, బీ నరేశ్, మామిడి హరీశ్, ఏ శ్రవణ్‌కుమార్, పిట్ట సునీల్, సందీప్, సతీశ్, రమేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రావు, బండి సారంగపాణి, రేగూరి విజయపాల్‌రెడ్డి, చందుపట్ల తిరుపతిరెడ్డి, గురిజపల్లి ప్రకాశ్‌రావు, చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.