కురవి, సెప్టెంబర్ 2 : గురువు చంద్రబాబు నాయుడు కోసం సీఎం రేవంత్‌రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశంపై విచారణను సీబీఐకి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మేరకు మంగళవా రం మహబూబాబాద్ పట్టణంలోని మెడికల్ కళాశాల హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి వెళ్తు న్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాన్వాయ్‌ను బీఆర్ఎస్ సత్యవతిరాథోడ్, కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కురవిలో అడ్డుకున్నారు.
డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో స్పెషల్‌పార్టీ పోలీసులు ముందస్తుగానే రోప్‌పార్టీ సాయంతో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులను తప్పించుకొని బీఆర్ఎస్ శ్రే ణులు 365 జాతీయ రహదారిపై బైఠాయించా రు. అదే సమయంలో మరిపెడ నుంచి మహబూబాబాద్‌కు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ము ఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్తో వెళ్తున్న కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఎట్టకేలకు పోలీసులు కాన్వాయ్ ను సురక్షితంగా పంపించారు. అనంతరం సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాల్వ వద్దకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. కాల్వల్లో తుమ్మలు మొలవడమే కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను కన్నబిడ్డలాగా చూసుకున్నారన్నారు. కాళేశ్వరాన్ని ఎండబెడితే బనకచర్లకు లాభం జరుగుతుందనుకోవడం రేవంత్‌రెడ్డి అవివేకమని, బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రాణమున్నంత వరకు అది జరగదన్నారు. ఓ పక్క ఎల్ఎండ్ టీ సంస్థ కేవలం రూ.300కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయగలమని చెప్పినా, రైతులను ఇబ్బందిపెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభు త్వం పట్టుబడుతున్నదని ఆరోపించారు.
యూరి యా సరిపడా అందించరని, వరదల్లో సర్వం కోల్పోయన వారిని పట్టించుకోరని, స్వయంగా సీతారాంతండాకు వచ్చి సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయరని, ఏ ముఖం పెట్టుకొని మంత్రులు ఈ ప్రాంతానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం కురవి మండల కేంద్రంలోని నాగమయ్య దేవస్థాన ఆవరణలో యూరియా పంపిణీ కోసం అధికారులు టోకెన్లు ఇస్తున్న ప్రదేశాన్ని సత్యవతి రాథోడ్, కవిత సందర్శించారు.
అక్కడే ఉన్న వ్యవసాయాధికారితో వారు మాట్లాడుతూ… మంత్రులను రైతులు అడ్డుకుంటారని తెలిసే నాగమయ్య దేవస్థానంలో టోకెన్ల పేరుతో అధికారులు కొత్త డ్రామా లేపారని ఆరోపించారు. సొసైటీలో 200 బస్తాలు ఉంటే రెండు వేల మంది రైతులను లైన్లో నిలుబెట్టుకొని చోద్యం చూడడం అధికారులకు తగదన్నారు. ఈ రోజు కూపన్లు ఇచ్చే రైతులకు యూరియా ఎప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా ఇవ్వకుంటే రేపు మరోసారి ఇక్కడే ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవి, రాజు నాయక్, నూతకి నరసింహారావు, దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, నరహరి, ముత్యం వెంకన్న, బోడ శ్రీను పాల్గొన్నారు.