ఐనవోలు : హనుమకొండి జిల్లా కొండపర్తి బీఆర్ఎస్ గ్రామ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు బుర్ర రాంబాబు గౌడ్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. కాగా, శుక్రవారం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండపర్తికి చేరుకొని రాంబాబు భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల కన్వీనర్ తంపుల మోహన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్కూర చంద్రమౌళి, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ కట్కూరి రాజు, గ్రామ కార్యదర్శి గద్దల ప్రభాకర్, బీఆర్ఎస్ నాయులు ఉపేందర్, కృష్ణబాబు తిరుమల్ రెడ్డి, స్వామి, శ్రీనివాసరావు, శంకర్, దిలీప్ రావు, గోవర్ధన్, రాజేశ్, మధుకర్, రాజు, సందీప్, వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.