పర్వతగిరి, సెప్టెంబర్18: భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు అధైర్య పడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం పర్వతగిరిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణ మాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నూత నంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ఎర్రబెల్లి సందర్శించారు. బ్యాంకు పరిధిలో 600 మంది రైతు లు రూ. 6 కోట్ల రుణం తీసుకుంటే 200 మందికి రూ. కోటీ 30 లక్షలు రుణమాఫీ అమలైందని బ్యాంకు సిబ్బం ది తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి వెంటనే రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ రైతుబంధుకు రాంరాం.. చెప్పి రుణ మాఫీ పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్ పూటకో మాట మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసగిస్తున్నాడని అన్నారు. కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు తలా తోక లేకుండా మాట్లాడుతూ రాష్ర్టాన్ని అంధ కారంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. సాగు, తాగు నీరు లేకుండా ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతులకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకోవాలని సూచించారు.
పార్టీ కార్యాలయం వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీలు మాడు గుల రాజు, కర్మిళ్ల మోహన్‌రావు, మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్, అమడగాని రాజు, బానోత్ వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, సీనియర్ నాయకులు మట్టపెల్లి చిన్న మాధవరావు, చింతల శ్రీనివాస్, మండల రైతు విభా గం అధ్యక్షుడు బాల్లె వెంకటరాజు, యూత్ అధ్యక్షుడు బూర శ్యామ్‌గౌడ్, సంపత్, మహిళా విభాగం అధ్యక్షురాలు బరిగెల విజయ, నాయకులు దేవా కుమార్, కొండ వెంకన్న, భిక్షపతి, విజయ్ పాల్గొన్నారు..