హనుమకొండ, మే సన్న వడ్లకు బోనస్ అంటూ బోగస్ మాటలను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజలు నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి ఎర్రబెల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొడ్డు కూడా కొంటామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నాడని అన్నారు. సీఎం బోగస్ మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు మరోసారి మోసం చేయాలనే ప్రయ త్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనకున్నా అప్పటి సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీలను మరిచి దాటవేస్తున్నారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తామంటూ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. దొడ్డు వడ్లను ఎక్కువగా సాగు చేస్తారని, ఇంటి అవసరాల కోసం మాత్రమే సన్నవడ్లను రైతులు సాగుచేస్తారని తెలిపారు. సన్న వడ్లకు మార్కెట్లో రూ.3వేలకు పైగా వస్తుంటే తక్కువగా ఉన్న ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్మరని చెప్పారు. 20 శాతం మాత్రమే సాగయ్యే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి, దొడ్డు వడ్లకు ఇవ్వకపోవడం అంటే రైతాంగాన్ని మోసం చేసినట్లేనని ఆరోపించారు. ప్రాజెక్టు వంకతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని తెలిపారు. రెండు నెలల నుంచి కల్లాల్లో ధాన్యం ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాల అభివృద్ధిని పట్టించుకోకుండా జిల్లాలను తగ్గిస్తానని అంటున్నారని, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. విద్యావంతుడు, యువకుడు, ప్రశ్నించేతత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు తెలంగాణ మలు పు అవుతుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్‌కు ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని పెద్దల సభకు పంపాలని, గ్రాడ్యుయేట్స్ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నెల ల్లో విఫలమైన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక చెంపపెట్టు కా వాలన్నారు. రాకేశ్‌రెడ్డి గెలిస్తే మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. జడ్పీ చైర్మన్ డాక్టర్ మారపెల్లి సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే లు చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, రసమ యి బాలకిషన్, సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ రవీంద ర్సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌ డ్, జోరిక రమేశ్, వీరేందర్, రామ్మూర్తి పాల్గొన్నారు.
హనుమకొండ/ ములుగు రూరల్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోరుతూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉదయం నర్సంపేట పద్మశాలి ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్స్ సభ ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లోని నాని గార్డెన్స్ లో వరంగల్ తూర్పు నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్, సాయత్రం 4గంటలకు హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ సమావేశంలో పాల్గొంటారని వివరించారు. ములుగులోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొంటారని జడ్పీ చైర్పర్సన్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి తెలిపారు. గ్రాడ్యుయే ట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయాలని కోరారు.