వర్ధన్నపేట/రాయపర్తి, ఆగస్టు : పంట రుణాలను రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలతో రైతులను మోసం చేస్తున్నదని మాజీ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త భాగంగా గురువారం వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్, రాయపర్తిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రాయపర్తి తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఎర్రబెల్లి మాట్లాడారు. రాష్ట్రం లో 25 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. ఇంకా 75 శాతం మంది రైతులకు మాఫీ కా వాల్సి ఉందన్నారు.
పంట రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభు త్వం రైతుల ఉసురు పోసుకుంటోందని విమర్శించారు. ఇప్ప టికీ రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయలేదని, సాగు జలాలను అందించలేదని,ప్రతిపక్షాలను విమర్శించడమే రేవంత్ సర్కారు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నదన్నారు. చేస్తామని ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్లు వేసిన రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడన్నారు. మాఫీ కాని రైతులు మనోవేదనకు గురవుతున్నారని, పూర్తిగా మాఫీ చేసేవరకూ బీఆర్ఎస్ ఆందోళన చేస్తుందన్నారు. రాయపర్తిలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారం కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నో చెప్పారని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. ముఖ్యంగా పంట రుణాలను రూ.2 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాల్సి ఉండగా, అర్థంలేని కారణాలతో మాఫీ చేయడం లేదు.
కాగా, ఎర్రబెల్లి ఇల్లందలోని యూనియన్ బ్యాంకు, కాకతీయ గ్రామీణ వికాస బ్యాంకును సందర్శించారు. రైతు రుణమాఫీపై రైతులతోపాటుగా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడారు. అర్హులైన రైతులకు కూడా కాకపోవడంపై అడిగారు. తమకు రేషన్‌కార్డు లేదని, బ్యాంకుల్లో సాంకేతిక లోపాలతో రుణమాఫీ జరగలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారని పలువురు రైతులు వాపోయారు. బ్యాంకు అధికారులతో మాట్లాడిన అనంతరం రైతులకు ధైర్యం చెప్పి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.