గణపురం, జూలై 29 : గురుకులాల విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల సాంబార్‌తో భోజనం పెట్టడంపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర లేక కడుపు మాడ్చుకుంటు న్న విద్యార్థుల దీన స్థితిని చూసి నిర్వాహకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆయన మంగళవారం భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి గురుకులాల బాట నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపు రం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే, మోడ ల్ సూల్, జూనియర్ కాలేజీ, కస్తుర్బా గాంధీ సూ ల్, బీసీ బాలికల వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వసతి గృహాల్లోని వసతు లు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెలుగొందిన గురుకులాలు నేడు అస్తవ్యస్తంగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యల వలయంలో సరస్వతీ నిలయాలు చిక్కుకున్నాయన్నారు.
20 నెలల్లోనే రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజనై దాదాపు 1000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దాదాపు 100 మంది వరకు మృతి చెందారన్నారు. ఎంజేపీ సూల్కు ప్రహరీ లేదని, అదనపు తరగతి గదుల అవసరం ఉందని, విద్యార్థినులు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోడల్ సూల్, కాలేజ్‌లో 380 మంది విద్యార్థులుంటే అందులో 220 మంది బాలికలున్నారని, వారికి అవసరమైన టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాత్రూంలు సైతం దుర్వాసన వస్తున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదన్నారు. నీళ్ల సాంబార్, ఉడికీ ఉడకని అన్నం, చాలీచాలని కూరతో విద్యార్థులు కడుపు మార్చుకుంటున్నారని, మొలకలెత్తిన ఆలుగడ్డలు వండుతున్నారని, ఇలాంటి భోజనంతో ఫుడ్ పాయిజన్ కాదా? అని గండ్ర ప్రశ్నించారు. గురుకులాల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి ఉండడం, పందులు స్వైరవిహారం చేయడంపై మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
గురుకులాల నిర్వహణ చేతకాకపోతే తమ జీఎంఆర్ ట్రస్ట్‌కు అప్పగించాలని, వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 గంటలే వైద్య సేవలందిస్తున్నారని, కలెక్టర్ స్పందించి 24 గంటలు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారివెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, భూపాలపల్లి మారెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనరసింహారావు, చెల్పూర్ మాజీ సర్పంచ్ నడిపల్లి మధుసూదన్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మంద అశోక్‌రెడ్డి, నాయకులు పిన్నింటి శ్రీనివాసరా వు, పెంచాల రవీందర్, బైరగాని కుమారస్వామి, గంజి జన్నయ్య, గాజర్ల చింటూ, ఆకుల తిరుపతి, ఎల్ల బోయిన భద్రయ్య తదితరులు ఉన్నారు.