తాడ్వాయి, జనవరి 26 : ‘తాము ఇలాంటి భోజనమే అందిస్తాం.. సీఎం చెప్పినా మారదు.. తింటే తినండి.. లేదంటే ఊరుకోండి’ అంటూ జోనల్, సె క్టార్లలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు మెస్ ని ర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. కోటిమంది భక్తులు హాజరయ్యే సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో భక్తులకు సేవలందించే అధికారులకు సరైన, రుచికరమైన భోజనం అందకపోవడంతో ఇబ్బందు లు పడుతున్నారు. సుమారు 300 మందికి మేడారంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
గత మూడు రోజులుగా సమయానికి నాణ్యమైన భోజ నం అందించకపోవడం, రుచీపచీ లేకుండా అన్నం ముద్దలుగా ఉండడంతో తినలేకపోతున్నామని అధికారులు పెదవి విరుస్తున్నారు. భోజనం సక్రమంగా లేదని కొందరు అడగడంతో ‘ఇదే ఉంది.. తింటే తినండి.. లేదంటే ఊరుకోండి.. సీఎం చెప్పినా ఇదే భోజనం అందిస్తాం’ అని అన్నట్లు తెలిసింది. దీంతో ఏం చేయలేక తమ సొంత డబ్బులతో హోటల్లో భోజనం చేస్తూ విధులకు హాజరవుతున్నారు.