కరీమాబాద్/ గిర్మాజీపేట/ పోచమ్మమైదాన్/ ఖిలావరంగల్/ కాశీబుగ్గ, ఆగస్టు 2 : వరద బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ 32వ డివిజన్ బీఆర్‌నగర్, రాజీవ్ గృహకల్ప, గాయత్రీనగర్ కాలనీల్లోని వరద భాధితులకు బుధవారం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షం వల్ల ఇబ్బందులు కలిగాయన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మ, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, 32 వ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, నాయకులు నాగపురి సంజయ్‌బాబు, మండ శ్యాం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అలాగే, 40వ డివిజన్లో ముంపుకు గురైన డీకేనగర్లో బాధితులకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ మరుపల్ల రవి, డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్‌కుమార్, నాయకులు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, ఎలగొండ రవి, వొగిలిశెట్టి సంజీవ పాల్గొన్నారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో కాశీకుంటలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోశాల స్వామి, హైమద్‌ఖాన్ పాల్గొన్నారు. అలాగే, 28వ డివిజన్ ఎన్టీఆర్నగర్ కాలనీ ప్రజలకు వారానికి సరిపడా సరుకులను తన వ్యక్తిగతంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అందజేశారు. కార్పొరేటర్ కల్పనతో కలిసి కాలనీలో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు.
కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్, వడ్డెర కోటి పాల్గొన్నారు. 12వ డివిజన్ కేఎల్ మహేంద్రనగర్‌లో కూడా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవిత, బీఆర్ఎస్ నాయకులు కాశెట్టి వేణు, ఖాసీం, రాంకీ పాల్గొన్నారు. అలాగే, దేశాయిపేటకు చెందిన కన్నెబోయిన కొమురయ్య ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. శివనగర్‌లోని మైసయ్యనగర్ ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, మైసయ్యనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యం, సర్వర్, రేణుక, అలీ, రాజు, షారుఖ్, సురేందర్, బ్రహ్మచారి, కిరణ్, జాన్సన్, ప్రభాకర్ పాల్గొన్నారు. 19వ డివిజన్ గాంధీనగర్‌లో బాధితులకు ఎన్ఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ పాల్గొన్నారు.