తగ్గుతూ పెరుగుతున్న ప్రవాహం
వాజేడు, జూలై 25 : గోదావరి నదీ ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. వాజేడు మండలంలోని పేరూరు, వాజేడు, పూసూరు, ఎడ్జర్లపల్లి మీదుగా ప్రవహిస్తున్న నది ఒక్కోరోజు ఒకలా ఉంటుంది. ఇటీవల ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహించడంతో వరదలకు పలు గ్రామాలు నీట మునిగాయి.
రహదారులు కూడా దెబ్బతిన్నాయి. వర్షాలు కొద్దిగా తెరిపినివ్వడంతో తగ్గినట్టే తగ్గి మళ్లీ సోమవారం మధ్యాహ్నం పేరూరు వద్ద 42 అడుగుల(13 మీటర్లు)కు చేరింది. సాయంత్రం 12.880 మీటర్లకు తగ్గి ప్రవహిస్తోంది. దీంతో నది పరీవాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.