గిర్మాజీపేట, ఫిబ్రవరి 3: వరంగల్ 33వ డివిజన్లోని ఇసుక అడ్డా కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించిం ది. స్థానిక రాజశ్రీ గార్డెన్ ఎదురుగా ఉన్న పాత దర్వాజా లు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన గోదాం లో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న పెస్టిసైడ్ ఏజెన్సీ గో దాం, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తదితర షాపులకు వ్యా పించాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల్లోకి పొగ రా వడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ కలకోట గిరికుమార్, మిల్స్‌కాలనీ సీఐ ముష్కమల్ల శ్రీనివాస్ తన సిబ్బందితో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 4. 10 గంటలకు అగ్నిప్రమాదం సమాచారం అందగానే సిబ్బందిని అప్రమత్తం చేశాం.
ఆరు ఫైరింజన్లతో మధ్యాహ్నం రెండు గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. అగ్నిప్రమాదంలో ఎండీ అబ్దుల్లా ఫర్నిచర్ షాపు రూ.35 లక్షలు, మాషా అల్లా ట్రేడర్స్ షాపు రూ. 20 లక్షలు, A TO Z ఫర్నిచర్ షాప్ రూ. 30లక్షలు, లక్ష్మీ వినాయక పాత సామాన్ల షాపు రూ. 5 లక్షలు, మాధురి ఫెస్టిసైడ్స్, సీడ్స్ ఏజెన్సీ గోదాంలో రూ. 40 లక్షలు, మహాలక్ష్మి ఆటో మొబైల్స్ షాపునకు రూ. 5 లక్షలు, మరో షాపులో రూ.2 లక్షల విలువైన ఆస్తితో మొత్తం రూ. 1.37 కోట్ల నష్టం వాటిల్లింది. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి ప్రాథమిక విచారణ అనంతరం సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియపరుస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంతో ఉపాధిని కోల్పోయామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. కాగా, జనావాసాల మధ్య కలప సామగ్రికి సంబంధించిన దుకాణాలు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతాం
ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలపై అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఆరాతీయగా సీసీ కెమెరాల పుటేజిని పరిశీలిస్తామన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ మామిడి భగవాన్‌రెడ్డి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కొండం జైపాల్‌రెడ్డి, పైర్ ఆఫీసర్లు శ్రీనివాస్‌రావు, వక్కల భద్రయ్య, బీఆర్ఎస్ నాయకులు ముష్కమల్ల సుధాకర్, దుబ్బ శ్రీనివాస్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.