ఏటూరు నాగారం : ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, తమ వాహనాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్థానిక ఎస్సై రాజ్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ వాహనదారులను హెచ్చరించారు. నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏటూరు నాగారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజల ద్విచక్ర వాహనదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం కూడా తగదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం చేయడం వాహనాలకు సంబంధించిన కాగితాలు లేకపోవడం, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం తగదన్నారు. తాము ఆదివారం నుంచి నిర్వహించే స్పెషల్ డ్రైవ్లో పట్టుకుని జరిమానా విధించి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.