హనుమకొండ, నవంబర్ 20 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రునికి రుద్రాభిషేకం అనంతరం కార్తీకమాసోత్సవ పూజలు నిర్వర్తించుకొని ఉపవాస దీక్షలు గురువారం పూర్తి చేసుకుని దేవాలయంలో నిత్య రుద్రాభిషేకాలు నిర్వర్తిహించారు. ఆలయ నాట్యమండపంలో వందలాది మంది మహిళలు 51 కిలోల పసుపుతో గౌరీనక్త వత్రాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వరీదేవిని పసుపుతో మహాగౌరీగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు.
కాగా, ప్రముఖ సినీనటుడు ఆది సాయికుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివకార్తీక్, సంతోష్ స్వామి వారిని దర్శించుకున్నారు. వరంగల్ జిల్లాకి శంభాల మూవీ ప్రమోషన్ కోసం వచ్చామని, గతంలో నేను ఈ దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరున్ని దర్శించుకున్నామని ఆది తెలిపారు.