పోచమ్మమైదాన్, ఆగసు 12: ఓరుగల్లు సాహితీ రుద్రమగా పేరొందిన అనిశెట్టి రజితకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమెను కడసారి చూసేందుకు నగరం సహా వివిధ జిల్లాల నుంచి వందలాది సాహితీవేత్తలు మంగళవారం హనుమకొండ కేయూ ఫస్ట్ గేట్ వద్ద ఉన్న రిటైర్డు ప్రొఫెసర్ ఇంటికి చేరుకొని అక్కడ ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె నిర్జీవదేహాన్ని తీసుకెళ్లేందుకు తోబుట్టువులు రాకపోవడం సాహితీమిత్రులను కలచివేసింది.
కానీ, మంచి మనసున్న తోటి కవయిత్రి, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ముందుకురావడం అందరినీ కదిలించింది. రజితను గౌరవంగా సాగనంపాలని పార్థివదేహాన్ని హాస్పిటల్లో ఉంచకుండా తన ఇంటికి తీసుకరమ్మని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. కాగా, రజిత మృతికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ సంతాపం ప్రకటించారు. ఆమె మృతి కవులు, కళాకారులకు సాహితీవేత్తలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, తాయమ్మకరణ, శోభ రమేశ్, గడ్డల లక్ష్మణ్, రమాదేవి, సీపీఎం నాయకుడు ఎం.చుక్కయ్య నివాళులర్పించారు. ప్రజాస్వామ్య రచయిత వేదిక అధ్యక్షుడు ఏడ్లూరి మానస, జానకీదేవి, చర్లపల్లి స్వరూపారాణి, కొమ ర్రాజు రామలక్ష్మి, బండారి సుజాత, బిట్ల రమాదేవి, నెల్లుట్ల రమాదేవి, తెలంగాణ రచ యితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బిల్ల మహేం దర్, విరసం అధ్యక్షుడు కోడం కుమారస్వామి, అరసం అధ్యక్షుడు బ్రహ్మచారి,
తెలంగా ణ రచయితల వేదిక అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, కాళోజీ అవార్డు గ్రహీతలు అన్నవరం వేదాంత్, నలిమెల భాస్కర్, ప్రముఖ కవులు వల్లంపట్ల నాగేశ్వర్రావు, ఎస్.వేదాంత, ప్రజా కవి జిలుకర శ్రీనివాస్, ప్రొఫెసర్ బన్న ఐలయ్య, రమాదేవి, ఠాకూ ర్ రతన్‌సింగ్, రమేశ్‌బాబు, రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయిని, అన్వర్ తదితరులు రజితకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఆమె పార్థివదేహాన్ని కేఎంసీకి అప్పగించారు.
ప్రముఖ కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకి కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో నివాళులర్పించి, సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రజిత ఆ తర్వాత వచ్చిన అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి పేర్కొన్నారు.
ఆమె మరణం సాహితీలోకానికి తీరని లోటని ప్రముఖ కవి అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాసరావు, పందిళ్ల అశోక్‌కుమార్, ఆచార్య బన్న అయిలయ్య, గంట రామిరెడ్డి, కేశిరెడ్డి మాధవి, డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షుడు డాక్టర్ బదావత్ రాజు సంతాపం ప్రకటించారు. రజిత మరణం ఆమె దేహానికి కానీ అక్షరాలకు కాదని, ఓరుగల్లు సాహితీక్షేత్రంలో మీ అక్షరాలు ఘల్లు ఘల్లుమంటూ చైతన్యపరుస్తాయని పేర్కొన్నారు. నెల్లుట్ల రమాదేవి, బూర విద్యాసాగర్, డాక్టర్ టీ శ్రీరంగస్వామి, రామా చంద్రమౌళి, పల్లేరు వీరస్వామి, ప్రసాద్, గట్టు రాధిక, దేవులపల్లి వాణి, ఎన్.రమ, శంకర నారాయణ, అరుణ కీర్తి పతాకరెడ్డి, ఎన్వీఎన్ శాస్త్రి, మాదారపు వాణిశ్రీ, బోళ్ల రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు.