కరీమాబాద్, మార్చి 4 : ‘మభ్యపెట్టే మాటలొ ద్దు.. మామునూరు ఎయిర్‌పోర్టుకు మా భూములు ఇచ్చేందుకు సిద్ధం.. పరిహారం భూమికి భూమి ఇస్తా రా.. డబ్బులిస్తరా.. స్పష్టమైన హామీ ఇవ్వండి.. అలా గే మొదట మా గ్రామాలకు రోడ్డు నిర్మించండి’ అని మామునూరు ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకున్నారు.
రంగశాయిపేట నుంచి తమ గ్రామాల మీదుగా ఉన్న రోడ్డును మూసేస్తామంటున్నారు.. మొదటగా రోడ్డు నిర్మించిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కలపల్లి, గుం టూరుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి రైతులు గ్రామాల అధికారులను నిలదీశారు. రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, ఇంకా అనుమతి రాలేదని అధికారులు చెప్పగా, అనుమతి వచ్చిన త ర్వాతే ఇక్కడికి రండి.. అంటూ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతు లు మాట్లాడుతూ.. సమావేశాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు తలోమాట చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారన్నారు.
తాము ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని కానీ, ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతం లో ప్రజాప్రతినిధులు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చిన భూ యజమానులకు సమీపంలోని భూములను ఇస్తామని చెప్పారని, తర్వాత వచ్చిన అధికారులు భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందజేస్తామంటున్నారన్నారు. మంత్రి మాటలకు, స్థానిక ఎమ్మెల్యే మాటల కు పొంతనలేదన్నారు. పరిహా రం ఎంత మేరకు ఇస్తారు.. అనే ది నేటికీ స్పష్టత లేదన్నారు.
ఈ విషయ మై మంత్రి, ఎమ్మెల్యేను కలిసేందుకు వెళితే తమ బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాక సర్వే చేయొద్దన్నారు. ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్రావు రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సర్వే చేయొద్దని తెగేసి చెప్పా రు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. సర్వేను రైతులు అడ్డుకోవడంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. డీసీపీ రవీందర్‌తోపాటు పరకాల, మామునూరు, నర్సంపేట ఏసీపీలు చేరుకున్నారు. నిరసన చేపట్టిన రైతులను అడ్డుకున్నా రు. నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని వారించారు. రైతులు రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. రైతులు జై జవాన్-జై కిసాన్ అని నినాదాలు చేశారు.
సంబురాలే కాదు.. సమస్యలను పరిష్కరించండి…
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తమ వల్లే అనుమతులు వచ్చాయని పోటీ పడి మరీ సంబురాలు చేసుకున్న అధికార పార్టీ నాయకులపై రైతులు మండిపడ్డారు. సంబురాలు చేసుకోవడమే కాదు.. మా సమస్యలను పరిష్కరించడంలోనూ పోటీ పడండి.. అంటూ చురకలు అంటించారు. ప్రజాప్రతినిధులుగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తలోమాట మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే పొంతనలేని మాటలతో ఆగం చేస్తున్నారన్నారు. ఎకరానికి రూ.3 నుంచి రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు.
డిమాండ్ల్లకు ఒప్పుకొంటేనే సర్వే చేయనిస్తం
సంగెం, మార్చి 4 : మా డిమాండ్లు పరిష్కరిస్తేనే సర్వే చేయనిస్తం. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం మంచిదే. అలాగే మా సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి గ్రామాలకు చెందిన రైతులం 253 ఎకరాలు కోల్పోతున్నాం. ఇందులో గుంటూరుపల్లి గ్రామంలో 123 ఎకరాలు, గాడెపల్లి చెరువు 20 ఎకరాలు, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 110 ఎకరాలు కోల్పోతున్నాం. సరియైన పరిహారం ఇవ్వకుండానే భూముల్లోకి వచ్చి సర్వే చేస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం. గతంలో గ్రామంలోకి వచ్చిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద భూములకు బదులుగా భూములు, డిమాండ్ ప్రకారం పరిహారం ఇస్తామని తలా ఓ మాట చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఇదంతా జరుగుతున్నది.
– వీరభద్రారావు, గుంటూరుపల్లి రైతు
ఎకరానికి రూ.5 కోట్లు ఇవ్వాలి
ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న మాకు ప్రభుత్వం ఎకరానికి రూ.ఐదు కోట్లు ఇవ్వాలి. వరంగల్ నగరానికి ఆనుకొని ఉన్న మా భూములకు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉన్న వరంగల్-మహబూబాబాద్ రోడ్డు మూస్తే మా గుంటూరుపల్లి నుంచి నేరుగా మామునూరుకు రోడ్డు వేయాలి. అలాగే భూములు కోల్పోతున్న నిర్వాతుల కుటుంబాలకు వారి అర్హతను బట్టి విమానాశ్రయంలో ఉద్యోగాలు కల్పించాలి. ఇవి ప్రధాన డిమాండ్లు. ఇవి తీర్చినట్లయితే భూములు ఇవ్వడానికి సిద్ధం.
– వెంకట్రావు, గుంటూరుపల్లి రైతు