వరంగల్ : దేశానికే ఆదర్శం రైతు బంధు పథకం అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో..
జనగామ జిల్లాకు మోడల్ మార్కెట్ కు నిధుల మంజూరుతో పాటు రైతుబంధు పెట్టుబడి సాయం బ్యాంకులో జమ చేయడానికి స్వాగతిస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.