ములుగురూరల్, ఆగస్టు 21 : రుణమాఫీపై నిబంధనలను ఎత్తివేయాలని బుధవారం రైతు సంఘం నాయకులు ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండీ గఫూర్ పాషా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకు రైతులందరి రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు నిబంధనల పేరుతో దగా చేస్తున్నదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మాత్రమే మాఫీ చేశారని, ఇంకా 60 శాతం మాఫీ జరగాల్సి ఉందన్నారు. నిబంధనలు ఎత్తివేసి ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షలు మాఫీ చేయాల ని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిం చారు. ఈమేరకు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కార్య క్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సారయ్య, యా కూబ్, రామస్వామి, రాజు, ప్రవీణ్, రవి, స్వామిరావు, రఘుపతిరెడ్డి, దేవేందర్, శంకర్, సదయ్య, సీతారాంనాయక్, సారమ్మ, సమ్మక్క, అన్నయ్య, సారయ్య పాల్గొన్నారు.