హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసత్యపు ఆరోపణలు ఖండించాలని, విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘా లు, సాలర్స్ ఆధ్వర్యంలో కేయూలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు, రిబ్బన్లు ధరించి నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభల ప్రచార నిమిత్తం బుధవారం స్మైలీ డిజీ సూల్కు వెళ్లిన పీడీఎస్‌యూ ఉమ్మ డి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మ ర్రి మహేశ్‌లపై చైర్మన్ శ్రీనివాస్‌వర్మ అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించి దాడి చేశాడని అన్నారు.
మహేశ్‌పై ఇనుపరాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. సూల్ చైర్మన్ శ్రీనివాస్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్కూల్ ఒక బ్రాంచ్‌కు మాత్రమే పర్మిషన్ ఉంటే రెండు ఓపెన్ చేసి అక్రమంగా దందాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. వెంటనే జిల్లాలో ఉన్న పర్మిషన్ లేని పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు మహేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు బోనగిరి మధు, కోశాధికారి రాణాప్రతాప్, కేయూ సాలర్స్ నేతలు డీ తిరుపతి, కే తిరుపతి, మధు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ నాగరాజు, సూర్యకిరణ్, సాయి, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు, డీఎస్ఏ జిల్లా కన్వీనర్ శివ, ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్ నాయకులు మనోహర్ చిరంజీవి వంశీ, సురేశ్ పాల్గొన్నారు.