నకిలీ విత్తనాల కలకలం
వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
- విత్తన దుకాణం ఎదుట రైతుల ఆందోళన
- పరిశీలించిన మాజీ మంత్రి దయాకర్రావు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫోన్
వర్ధన్నపేట, జూన్ 28 : వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. వర్ధన్నపేటలోని ఓ ఎరువుల దుకాణంలో రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన రైతులు మహేశ్, నాగరాజు వారం రోజుల క్రితం విత్తనాల బస్తాలను కొనుగోలు చేసి మండెకట్టారు. మూడు రోజులైనా మండె రాకపోవడంతో రైతులు వాటిని అదే బస్తాలో నింపి శుక్రవారం దుకాణం వద్దకు తీసుకొచ్చి నిలదీశారు. వ్యాపారి సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో రైతులు, స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. తాము బస్తాకు రూ.950 చెల్లించి కొన్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న విషయమై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాయపర్తికి వెళ్తున్న క్రమంలో వర్ధన్నపేటలో రైతుల ఆందోళన గురించి తెలుసుకొని వారితో మాట్లాడారు. మొలకెత్తని ధాన్యాన్ని పరిశీలించి వెంటనే వరంగల్ కలెక్టర్, స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దయాకర్రావు కోరారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించడం సరికాదన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రైతుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందని ఎర్రబెల్లి స్పష్టంచేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

