పాలకుర్తి/కొడకండ్ల, డిసెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలను ఎండగడుతూ, సీఎంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భా గంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలు పు కోరుతూ పాలకుర్తి మండలంలోని కోతులబాధ, తిరుమలగిరి, ఈరవెన్ను, పాలకుర్తి, రాఘవపురం, బ మ్మెర, వల్మిడి, ముత్తారం, సిరిసన్నగూడెం, కొడకండ్ల, ఏడునూతుల, రామవరం గ్రామాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలన నడిపిస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని అన్నారు. మోసకారి కాంగ్రెస్‌కు సర్పంచ్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల కష్టాలను తీర్చడంలోనూ సర్కారు విఫలమైంద న్నారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారన్నారు. మహిళా సంఘాల డబ్బులతోనే మహిళలకు చీరెలు పంపిణీ చేశారని విమర్శించారు. రెండేళ్లలో పాలకుర్తి నియోజక వర్గంలో అభివృద్ధి శూన్యమ ని, ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. వచ్చేది కేసీఆర్ పాలనే అని, తాను మళ్లీ మంత్రినవుతానని, బీఆర్ఎస్ సర్పంచ్‌లను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎవరూ అధైర్యపడొద్దని, తన వెనుక రాజ్యసభ సభ్యు లు, ఎమ్మెల్సీలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభు త్వం నిధులు ఆపడానికి ప్రయత్నించినా, తమ సత్తా తో నిధులు రాబడతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆగిన పనులను మళ్లీ మొదలు పెడతామని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి ప్రజలు ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వారికి సేవ చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూ రి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, సర్పం చ్ అభ్యర్థులు కమ్మగాని విజయ నాగన్న, చిలుముల మహేశ్‌రెడ్డి, ముస్కు సౌమ్య, తాళ్ల సంధ్య, చింతకింది అనిత, బానోత్ యాకయ్య, గాదరి సోమయ్య, నల్లా లక్ష్మీనాగిరెడ్డి, చెరిపెల్లి మమత, మసురం రాధలక్ష్మీవెంకటనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, సీనియర్ నాయకులు సోమేశ్వర్రావు, రమేశ్, రాంబాబు, ఇమామ్, సోమయ్య, ప్రతాప్, శంకరయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.