పోచమ్మమైదాన్, మే 17: బీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పార్టీ 22వ డివిజన్ ఇన్చార్జి మావురపు గీతా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం పోచమ్మమైదాన్‌లోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసి, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయానికి తోడ్పాటునందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షగా భావిస్తూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అంతటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా చిల్లర వేషాలు వేస్తున్న బీజేపీ నాయకుల చర్యలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కంచర్ల శివ, దుబ్బ శ్రీనివాస్, జన్ను ప్రమోద్, జూపాక సురేశ్, మైస మొగిలి, రొయ్యల పావని, కృష్ణంరాజు, దామెర లలిత, జన్ను ప్రకాశ్, ఫక్రొద్దీన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం
గిర్మాజీపేట: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 33వ డివిజన్లో చిన్నబ్రిడ్జి వద్ద చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు చేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈ నరేందర్, ఏఈ ముజామిల్, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్‌కుమార్, బైరి ప్రతాప్, యూత్ నాయకులు వై సురేశ్, వనం శ్యామ్, ఆర్ భిక్షపతి, జీ ధర్మేందర్ పాల్గొన్నారు.