దేవరుప్పుల, ఫిబ్రవరి 24: రైతులతో పాటు అన్ని వర్గాలు కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతుంటే, వాటిని పరిష్కరించలేని పాలకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ జైళ్లకు పంపిస్తున్నారని, కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ మేనని.. పాలకుర్తి నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పెడుతున్న కేసులు ఏ ఒక్కటీ మరిచిపోం.. అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఎన్ని సీట్లు వస్తాయనే విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, ఈ పాచిక పారదనే విషయం గ్రహించాలన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులను గుం డెల్లో పెట్టుకుని చూసుకున్నాడని, కరోనా కష్ట కాలాన్ని లెక్క చేయక రైతు భరోసా రైతుల ఖాతాలో వేసిన ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక పొలాలు ఎండు తుంటే, రైతులను ఆదుకునే నాథుడే లేడన్నారు. రుణమాఫీ లేదు, రైతు భరోసాలేదు, రైతు బీమా లేదు, యూరియా బస్తాలు లేవని, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పాలనానుభవం లేక కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. లెక్కకు మించిన అప్పులు తెచ్చినా, ఏ ఒక్క పథకాన్ని అమలుచేయని ఈ సర్కారుపై అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయన్నారు. పాలకుర్తిలో ఎండిన పంటలు, రైతుల ఆవేదన చూస్తుంటే బాధేస్తుందన్నారు. తన పర్యటనలో అడుగడుగునా రైతులు సాగునీరు కావాలని మొరపెట్టుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షకార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్, ఎస్సైని నిలదీస్తే వారిపై కేసులు పెట్టిస్తారా, వారేం తప్పు చేశారని ఆ యన ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ నా యకులకు వత్తాసు పలుకుతున్నారని, ఈ పద్ధ తి మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని ఎర్రబెల్లి హెచ్చరించారు. రాష్ట్రంలో మంత్రులకు ఏం మాట్లాడాలో తెలియడంలేదని, ఏ సమయంలోనైనా రేవంత్ సర్కారు కూలవచ్చని జోస్యం చెప్పారు.
నేడు ఎనుమాముల మార్కెట్‌కు ఎర్రబెల్లి
కాశీబుగ్గ, ఫిబ్రవరి 24 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవా రం సందర్శించనున్నారు. ఉదయం 9గంటలకు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మిర్చి ధర లు, మార్కెట్ సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీసి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.