తొర్రూరు, జనవరి 4 : సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో జీకే తండా, వెంకటాపురం గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఇన్సూరెన్స్ చెకులు అందజేసి మాట్లాడారు. కార్యకర్తలు ఇబ్బందులుంటే వెంటనే సమాచారమివ్వాలని, నమ్ముకున్న వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
దేశంలో పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా కాపాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కొద్ది రోజుల్లోనే గ్రామ, మండల, జిల్లాతో పాటు అనుబంధ కమిటీలను వేస్తామన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినా నిధులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరని అన్నారు.
లోకల్‌బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ఎర్రబెల్లి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సీతారాములు ఐలయ్య, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్న అంజయ్య, నాయకులు సోమేశ్వరరావు, ప్రమోద్, రామచంద్రశర్మ శ్రీనివాస్‌రావు, ఉపేందర్, కృష్ణమూర్తి, అంకూస్, వెంకన్న, నాగరాజు, జనార్దన్రాజ్, లింగన్న గౌడ్, వీరారెడ్డి, రవి, మణిరాజ్, రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.