వరంగల్, ఫిబ్రవరి 3 : బీజేపీ జిల్లా అధ్యక్షులను సోమవారం ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ పరిధిలో మహబూబాబాద్ మినహా ఐదు జిల్లాల అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. మానుకోట జిల్లాకు అధ్యక్షుడిని ప్రకటించలేదు. ఇక నాలుగు జిల్లాలకు పాత వారికే మరోసారి అవకాశం కల్పించగా హనుమకొండ జిల్లాకు మాత్రం కొత్త వారిని నియమించారు. అధ్యక్షులతో పాటు జిల్లాకు ఇద్దరు చొప్పున జిల్లా కౌన్సిల్ సభ్యులను ప్రకటించారు.
హనుమకొండకు గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కొలను సంతోష్‌రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పరకాల నియోజకవర్గానికి చెందిన గట్టుకొప్పుల రాంబాబు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రావుల సుదర్శన్‌ను నియమించారు. వరంగ ల్ జిల్లా అధ్యక్షుడిగా గంటా రవికుమార్‌కు రెండోసారి నియమించారు. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా తూర్పు నియోజవర్గం నుంచి తాబేటి వెంకట్ గౌడ్, వర్ధన్నపేట నుంచి మరిపెల్లి రాంచంద్రారెడ్డిని నియమించారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా నిశిధర్రెడ్డిని రెండోసారి నియమించారు.
కౌన్సిల్ సభ్యుడిగా రాయరాకుల మొగిలిని నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా సౌడ రమేశ్‌కు రెండోసారి అవకాశం అవకాశమిచ్చారు. కౌన్సిల్ సభ్యులుగా జనగామ నియోజకవర్గానికి చెందిన మహేందర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గానికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, పాలకుర్తి నియోజవర్గానికి చెందిన కాసోజు సమ్మయ్య చారిలను నియమించారు. ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంకు మరో అవకాశం కల్పించారు. కౌన్సి ల్ సభ్యులుగా ములుగు నియోజవర్గానికి చెందిన భూక్యా జవహర్‌లాల్‌ను నియమించారు.