మహబూబాబాద్ రూరల్, జనవరి 1 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్యానాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ సర్కార్ ఉద్యోగాలు కల్పిస్తున్నదన్నారు. ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలోని బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎంపీ కవిత మానుకోట పార్లమెంట్ పరిధిలోని ప్రజల మన్ననలు పొంది మరింత అభివృద్ధి చేయాలని, ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. కవిత పుట్టిన రోజు వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మొదట స్థానిక ఆలయాల్లో ప్ర త్యేక పూజలు నిర్వహించిన కవితకు పట్టణ శివారులోని సలార్తండా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగ తం పలికారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. అనంతరం కోర్టు సెంటర్లోని ముత్యాలమ్మ ఆలయంలో వద్ద గజమాలతో సన్మానించారు. ఎమ్మార్వో సెంటర్ నుంచి ఎంపీ క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. క్యాంపు కార్యాలయంలో అభిమానులతో కలిసి కేక్‌కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా సంఘా ల నాయకులు, టీచర్లు, లాయర్లు, పట్టణ ప్రముఖులు కవితకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన 20మంది పేద విద్యార్థులకు సొంత ఖర్చులతో సైకిళ్లు, నిరుపేద దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేశారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, కేసన్రెడ్డి, ముత్యం వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్‌పాషా, జడ్పీటీసీలు, సర్పంచ్ పాల్గొన్నారు.
వీరభద్రుడి సన్నిధిలో పూజలు
కురవి, జనవరి 1: ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తన పుట్టినరోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మండల అధ్యక్షుడు తోట లాలయ్య, మహబూబాబాద్ మార్కెట్ చైర్పర్సన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, ఎంపీపీ గుగులోత్ పద్మావతి సారధ్యంలో పార్టీ శ్రేణులు, ఆలయ అధికారులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ముఖమండపంలో వేదపండితులు మహాదాశీర్వచనం చేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, కేఎస్ఎన్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, ఆలయ చైర్మన్ రామూనాయక్, మాజీ చైర్మన్ రాజూనాయక్, వైస్‌ఎంపీపీ నర్సయ్య, ఎంపీటీసీలు చిన్నం భాస్కర్, భోజ్యానాయక్, గణేశ్, రాం చంద్రయ్య, నర్సింహారావు, యతిరాజ్, రమేశ్, రాము, శ్రీశైలం, వెంకటరమణ, సీహెచ్ మల్లయ్య, గణేశ్, బాదావత్ లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం కురవి మండల కేంద్రం నుంచి భారీ బైక్ ర్యాలీతో ఎంపీ కవితను మహబూబాబాద్ జిల్లా కేంద్రం వరకు బీఆర్ఎస్ శ్రేణులు తొడ్కోని వెళ్లారు.