Ameer Log | టాలీవుడ్లో యూత్‌పుల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్నచిత్రం అమీర్ లోగ్. రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానా నేతృత్వంలోని స్పిరిట్ మీడియా సొంతం చేసుకుంది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న సినిమా కావడం, రానా టీం విడుదల చేస్తుండటంతో హైప్ పెరిగిపోతుంది. ఈ మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు.
అమీర్ లోగ్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచిందని తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ మాసీ వాయిస్, మరోవైపు ఆనీ మాస్టర్ మాస్ డ్యాన్స్‌తో ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా సాగుతున్న ఈ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ, మ్యూజిక్ లవర్స్. ఇప్పటికే లాంచ్ చేసిన అమీర్ లోగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
.@Awwal_Films Proudly announces its collaboration with @SpiritMediaIN for #Ameerlog Distribution Partner- a film packed with Hyderabadi soul and stories straight from the heart. ❤️🔥
It’s a movement.
It’s madness.
It’s AMEERLOG releasing soon in theatres!@awwal_Films… pic.twitter.com/h5QCTLLPRU— BA Raju’s Team (@baraju_SuperHit) July 1, 2026