న్యూఢిల్లీ: వాట్సాప్‌లో ప్రతిపాదిత ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను ప్రస్తుతానికి తీసుకురావద్దని మెటా సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై తగిన సంప్రదింపులు పూర్తయ్యేవరకూ ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది. ఈ ఫీచర్ కారణంగా తలెత్తే పరిణామాలపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ‘మెటా’ను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను ఇతరులతో పంచుకోకుండా చాటింగ్ చేసుకునేలా ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను తీసుకురావాలని వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’ భావించింది. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు సృష్టించేందుకు అవకాశం ఉందని, ఆన్లైన్ మోసాలు, ఆర్థిక నేరాలు పెరుగుతాయని సైబర్ భద్రతా నిపుణులు, ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాట్సాప్ నూతన ఫీచర్‌పై నిఘా పెట్టింది.