హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం నాన్ బోర్డర్ల మీద పెట్టిన దృష్టి విద్యావ్యవస్థ మీదెందుకు పెట్టడంలేదని స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ ప్రశ్నించారు. స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కేయూ గెస్ట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేయూ పరిధిలోని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో రిజల్ట్స్ఇవ్వాలని, ఫార్మసీ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతి ఎత్తివేయాలన్నారు.
వేలాదిమంది విద్యార్థులతో కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా ఎలాంటి సర్క్యులర్లు, జీవోలు తీయకుండా కాలయాపన చేసిన కేయూ అధికారులు అత్యవసరంగా సర్క్యులర్లు తీస్తూ విద్యార్థులకు ఉపయోగపడని అంశాలపై అర్ధరాత్రి జీవోలు సృష్టిస్తున్న యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. వివిధ విభాగాల్లో సరిపడా ప్రొఫెసర్స్ లేక విద్యార్థులు, కేయూ లైబ్రరీలో మహిళా మూత్రశాలలో నీళ్లులేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటివి పట్టించుకోకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రక్రియ యూనివర్సిటీలో జరుగుతుందన్నారు. కేయూ కామన్ మెస్‌లో కుళ్లిపోయిన టమాటాలు, పుచ్చిపోయిన బీరకాయలు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగితే ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో కేయూ స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ అధ్యక్షుడు మోజెస్, చెట్టుపల్లి శివకుమార్, విష్ణు, ఆనంద్, భాస్కర్, సతీష్, సుఖేష్, అవినాష్, శ్రావణ్, అజయ్, రాకేష్ ఉన్నారు.