తప్పతాగి.. మాటలు తూలి..
వ్యవసా య, పరిశ్రమల రంగం, గృహ అవసరాలతోపా టు ఇతరాత్ర అనేక అవసరాలకు విద్యుత్ రంగమే కీలకం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం వేలాది సబ్స్టేషన్లు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసి, 24 గంటల కరెంటును సరఫరా చేసింది.
- మద్యంమత్తులో ఎల్కతుర్తి విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్
- సమస్యలు చెప్పేందుకు ఫోన్ చేసిన రైతులపై అనుచిత వ్యాఖ్యలు
- ఎల్సీ ఇచ్చేది వారే..
- మిస్ ఫైర్ అయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు
హనుమకొండ సబర్బన్, ఆగస్టు 2 : వ్యవసా య, పరిశ్రమల రంగం, గృహ అవసరాలతోపా టు ఇతరాత్ర అనేక అవసరాలకు విద్యుత్ రంగమే కీలకం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం వేలాది సబ్స్టేషన్లు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసి, 24 గంటల కరెంటును సరఫరా చేసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ప్రతి సబ్‌స్టేషన్‌కు ప్రత్యేక ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించింది. ప్రతి సబ్‌స్టేషన్ నుంచి అన్ని విభాగాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్ ఆపరేటర్లను నియమించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పట్టింపులేనితనం..,అధికారుల నిర్లక్ష్యం వల్ల సబ్స్టేషన్లు సిబ్బందికి ఇష్టారాజ్యంగా మారాయి. ఒక్కో మండలంలో విద్యుత్ సరఫరా కోసం, విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం, కొత్త, పాత విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి.
ఇందులో మండల స్థాయిలో ఏఈ, అతడి కింద అడిషనల్ ఏఈ, సబ్‌స్టేష న్ల పరిధిలో లైన్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు, ఆ తర్వాత ఆర్టిజన్ కార్మికులు, చివరగా అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు పని చేస్తా రు. ఈ ప్రక్రియలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పాత్రే కీలకం గా ఉంటుంది. నిర్వహణ మొత్తం వారే చూసుకుంటా రు. విడుతల వారీగా పనివేళలు ఉంటాయి. ప్రతి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యు త్ సరఫరా, పునరుద్ధరణ పనులన్నీ అతడే చూసుకుంటాడు. అయితే, అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్ల కొన్ని సబ్స్టేషన్లలో ఆపరేటర్లు మద్యంమత్తులో తూగుతున్నారు. తప్పతాగి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే తరహాలో ఆదివారం కొందరు రైతులు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సబ్‌స్టేషన్‌కు పలు సమస్యలపై ఫోన్లు చేయగా, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న రమేశ్ అనే ఆపరేటర్ రైతులతో అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో పలువురు రైతులు సబ్‌స్టేషన్‌కు చేరుకొని అతడితో మాట్లాడే ప్రయత్నం చేయగా.., తప్ప తాగి ఉన్న సదరు ఉద్యోగి నోటికొచ్చినట్లు రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు సబ్‌స్టేషన్ అరుగుపై కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని సిగరేట్ వెలిగించి, సినిమా తరహా దృశ్యాన్ని ఆవిష్కరింపజేశాడు. దీంతో నివ్వెరపోయిన రైతులు అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన సబ్‌స్టేషన్‌కు వచ్చిన స్థానిక ఏఈ సుధాకర్ అతడి ప్రవర్తనపై ఆరా తీయగా.. అతడిముందే సద రు ఆపరేటర్ అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఏఈ సుధాకర్ మాట్లాడుతూ ఆపరేటర్ మద్యం తాగినట్లుగా తమ కు తెలిసిందని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా సబ్‌స్టేషన్ ఆపరేటర్ విద్యుత్ సరఫరా విషయంలో అత్యంత కీలకపాత్ర పోషించాల్సిన ఉంటుంది.
మిగతా లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు పలు పనుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఫో న్లలో సమాచారం ఇస్తారు.. పనులు పూర్తయిన తర్వాత పునరుద్ధరణ కోసం కూడా తిరిగి ఫోన్ చేస్తారు.. దీంతో విద్యుత్ సరఫరా ప్రక్రియ సక్రమంగా నడుస్తుంది. అయితే, మద్యం తాగిన ఆపరేటర్ల మూలంగా లైన్మెన్ కోరిన ఫీడర్ కాకుండా ఇత ర ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ప్రమాదాలు జరి గి ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. గతం లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ప్రాణాలు కోల్పోవడంతోపాటు తీవ్ర గాయాలపాలైన వారు అనేక మున్నారు. మద్యం నియంత్రణ కోసం వాహనదారులకు బ్రీత్ అనలైజర్ టెస్టులు పోలీసులు ఎలా చేస్తారో.. అదే విధంగా ఇలాం టి వారికి కూడా చేయాలనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

