సుబేదారి, డిసెంబర్ 28 : 2024లో 40 హత్యలు, 945 దోపిడీలు, దొంగతనాలు, 1600 ఘర్షణలతో పాటు అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలు పెచ్చుమీరగా, సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇక డ్రం క్ అండ్ డ్రైవ్ కేసులు 20వేలకు పెరుగగా, మహిళలపై దాడుల కేసులు 1,141గా ఉన్నా యి. ఇంకా క్రికెట్ బెట్టింగ్, పీడీఎస్ రైస్, గుట్కా, ఇతర అక్రమ దందాలు అన్నీ కలిపి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14, 406 నేరాలు జరిగినట్లు శనివారం సీపీ అంబ ర్ కిషోర్ ఝా మీడియా సమావేశంలో 2024 వార్షిక నేరాల వివరాలు వెల్లడించారు.
గతేడాదితో పోల్చితే ఈసారి హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గగా దొంగతనాలు, దోపీడీలు పెరిగాయి. మద్యం సేవించి వాహనాల నడిపి పోలీసులకు పట్టుబడిన మందుబాబుల కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. హత్యలు 40, హత్యాయత్నాలు 107, ఘర్షణలు 1600(గతేడాది కంటే 2.6శాతం ఎక్కువ) జరిగాయి. అలాగే దాడులు 56, దోపిడీ, దొంగతనాల కేసులు 945 కాగా, కిడ్నాప్ కేసులు 174, రోడ్డు ప్రమాదాలు 1,434. గతేడాదితో పోల్చితే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది.
ఈ ఏడాది మహిళలపై దాడుల కేసులు 1,141 నమోదయ్యాయి. వీటిలో హింస కేసులు 634 ఉన్నాయి. లైంగిక దాడులు 143, వరకట్నం చావులు 10, లైంగిక దాడికి యత్నం, దాడుల కేసులు 364 ఉన్నాయి.
ఈ ఏడాదిలో కోర్టు ద్వారా 2,462మంది నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడ్డాయి. లోక్‌అదాలత్ ద్వారా 3,915 కేసులు పరిష్కారమయ్యాయి. ఆస్తుల రికవరీలో గతేడాది 42శాతం కాగా, ఈసారి 29శాతమే చేశారు.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గా యి. 2023లో 1,558కేసులు నమోదైతే 2024లో 1,434 కేసులతో 7.9శాతంగా ఉంది. 417మంది మృతిచెందారు.
గతేడాది 15,386 డ్రైంక్ అండ్ డ్రైవ్ కేసు లు నమోదు కాగా, ఈ ఏడాది 20,338 కేసులు నమోదయ్యాయి. 509 మంది జైలు శిక్ష అనుభవించారు. కోర్టు ద్వారా రూ.18 కోట్ల జరిమానా విధించారు. ఈ ఏడాదిలో 1270 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 1128మందిని పోలీసులు గుర్తించారు. షీ టీం పోలీసులు 18కేసులు నమోదు చేసి 150మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో 772 సైబర్ నేరాలు నమోదు కాగా, రూ.కోటీ 30 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ఇతర మత్తు పదార్ధాలకు సం బంధించినవి మొత్తం 147 కేసులు నమోదు కాగా, రూ.2కోట్ల 63లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని 321మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో మొత్తంగా గొడవలు, దోపీడీలు, దొంగతనాలు, డ్రైంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగాయి.
దోపిడీ కేసుల్లో ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 18 అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్, పీడీఎస్ రైస్, గుట్కా, ఇతర అక్రమ దందాలకు సంబంధించిన 590 కేసుల్లో 1,145 మంది ని అరెస్ట్ చేసి ఒక కోటీ 77లక్షల విలువ చేసే ప్రాపర్టీని సీజ్ చేశారు. ఈ ఏడాదిలో పాస్‌పోర్ట్ కోసం 34,692మంది ఆప్లికేషన్ పెట్టుకున్నారు. ఎస్బి పోలీసులు 34,424మందికి అప్రూవల్ ఇచ్చారు. ఈ ఏడాదిలో 2,964మంది ఫోన్లు పోగొట్టుకొని సీఈఐఆర్ పోర్టల్‌లో అప్లయ్ చేసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టి ఇప్పటివరకు 2,462 ఫోన్లను తిరిగి బాధితులకు అందజేశారు.