హనుమకొండ చౌరస్తా, జూన్ 7 : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 15వ ఉభయ రాష్ర్టాల తెలుగు ఆహ్వాన నాటిక పోటీలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో వరంగల్ పోతన విజ్ఞానపీఠంలో ప్రారంభించనున్నట్లు ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వివరాలు వెల్లడించారు.
ఆంధ్ర నుంచి మూడు, తెలంగాణ నుంచి మూడు మొత్తం ఆరు నాటికలు ప్రతిరోజూ రెండు చొప్పున సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ఆర్ మూర్తి, కళారాజేశ్వర్రావు, జీవీ బాబు, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్, జీఎన్ శర్మ, సాదుల సురేశ్, కుసుమ సుధాకర్, కుడికాల జనార్దన్, మలి విజయ్‌రాజ్, జూలూరి నాగరాజు పాల్గొన్నారు.