బచ్చన్నపేట జూలై 1 : అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని డాక్టర్ సృజన అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులందరూ కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ సృజన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పది మందికి ప్రాణం పోసేది వైద్యుడే అన్నారు. అందుకే వైద్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్లు అందరు నిబద్ధత, నిజాయితీతో పనిచేయాలని సూచించారు.
సమాజంలో వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. వృత్తిని వ్యాపారంగా కాకుండా సామాజిక సేవ కోణంలో చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సిద్ది సుదర్శన్ రెడ్డి, ప్రసన్న కృష్ణ, రాములు, అరుణ కుమారి, దీప్తి, ఝాన్సీ రెడ్డి, రమ్య, మాధురి, మమతలతో స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్ లక్ష్మి, అనిత, బొడ్డు శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.