వరంగల్ చౌరస్తా: హెచ్ఐవీ బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల పరిదిలోని ఐసీటీసీ, పిపిటీసీ, డీఎస్ఆర్సీ, ఎన్జీవోస్ సంస్థల ద్వారా గుర్తించబడిన కేసుల వివరాలపై చర్చించి కౌన్సిలర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.
సమాజంలో అవగాహణ పెంచడం మూలంగానే ఎయిడ్స్‌ను నివారించడం సాధ్యం అవుతుందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా వైద్యసేవలు నిరాటంకంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆచార్య, హనుమకొండ జిల్లా డీటీసీఓ డాక్టర్ హిమబిందు, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సూర్య ప్రకాష్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, సూపర్వైజర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.