ఖిలావరంగల్: ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. బుధవారం ఖిలావరంగల్ వాకింగ్ గ్రౌండ్లో భారతి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలన్నారు.
కష్టాల్లో ఉన్న వ్యక్తులకు మేమున్నామనే భరోసాన్ని స్వచ్ఛంద సంస్థలు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, కేయూ రిటైర్డ్ రిజిస్ర్టార్ నాగవెల్లి సాంబయ్య, సనాతన భారతి నాయకులు డాక్టర్ తాళ్ల సమ్మయ్య, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు బయ్య వెంకటేశ్వర్లు, కల్వచర్ల మోహన్‌రావు, నిమ్మకాయల సదానందం, నీలం వేణుమాధవ్, కర్ర వెంకటేశ్వర్‌రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, శ్రీపతి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.