మొగుళ్ళపల్లి, జూన్4 : భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీజన్ వ్యాధుల గురించి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు.
మందుల కొరత లేకుండా చూసుకోవాలని ప్రతి శుక్రవారం డ్రై డే సర్వే చేయాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా రంగాపురం, పిడిసిల్ల, మొట్లపల్లి నూతన సబ్ సెంటర్లను (పల్లె దవాఖానలను) పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ నాగరాణి, డాక్టర్ నవత, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.