మరిపెడ : వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై మండల స్థాయి అవగాహన సదస్సును ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు చికిత్స అంశాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రోగ నియంత్రణ చర్యలు, పారిశుద్ధం, పరిశుభ్రతపై తీసుకోవాల్సిన చర్యలు దోమల నియంత్రణకు చేపట్టాల్సిన స్ప్రే అంశాలపై అవగాహన కల్పించారు. టీబీ ముక్తా భారత కార్యక్రమంలో భాగంగా టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి టీబీని అంతం చేయాలని కోరారు.