రాజకీయాల్లో ఆయనది సుదీర్ఘ ప్రయాణం.. ఏడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ.. ఆరుసార్లు ఘన విజయం.. డోర్నకల్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా.., నిత్యం ప్రజాజీవితంలో ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎనిమిదోసారి బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయనను గురువారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ చేసింది. ‘ప్రాణమున్నంత వరకు ప్రజలతోనే ఉంట..45 ఏళ్లుగా వారితోనే నా ప్రయాణం సాగుతున్నది. ప్రభుత్వ సహకారంతో డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.200కోట్లు తెచ్చిన. ప్రతి తండా, గ్రామానికి సీసీ రోడ్లు వేయించి సౌకర్యాలు కల్పించిన. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నం. ముఖ్యంగా కాళేశ్వరం జలాలతో రైతుల కాళ్లు కడినం. కాంగ్రెస్ హయాంలో కాని ఎన్నో పనులను బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినం. ప్రజలకెన్ని మాయ మాటలు చెప్పినా కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ స్థానంలేదు.. ప్రజల ఆశీర్వాదంతో డోర్నకల్ నియోజకవర్గంపై మళ్లీ గులాబీ జెండా ఎగరేస్త’ నని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు.
నర్సింహులపేట, ఆగస్టు 24 : ‘సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న.. డోర్నకల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాసుఖాల్లో పాలుపంచుకుంటు న్న. వారితో విడదీయ లేని బంధం. నియోజకవర్గా న్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. గ్రామాలు, తండాలకు తారు రోడ్లు వేయించా. ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ సహకారంతో ఈ ఏడాది రూ.200 కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన. మరిపెడ, డోర్నకల్ మండలాలను మున్సిపాలిటీలుగా చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించా. దంతాలపల్లి, చిన్నగూడూరు, సీరోలు గ్రామాలను మండలాలు చేసి, పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేశా. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయే తప్ప వారు తెలంగాణకు చేసిందేమీ లేదు. గ్రామాలు, తండాల్లో ఎక్కడికిపోయినా నేనే చేసిన అభివృద్ధే కనిపిస్తుంది. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి రావడం ఖాయం. ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి, ఆరుసార్లు గెలిచిన. మరోసారి ఎమ్మెల్యే గెలుస్తా’నని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తెలిపారు. డోర్నకల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయనను గురువారం నమస్తేతెలంగాణ ఇంటర్వ్యూ చేసింది.
ఎమ్మెల్యే: 2014 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు, రైతులకిచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి డోర్నకల్ నియోజకర్గంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను నింపినం. సాగునీళ్లు పుష్కలంగా ఉండడంతో లక్షల క్వింటాళ్ల ధాన్యం పండుతున్నది. నీరు వృథాగా పోకుండా ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులపై కిలోమీటరుకు ఒకటి చొప్పున చెక్‌డ్యాంలు నిర్మించాం. దీంతో బావుల్లో చెంబుతో నీళ్లు ముంచుకునేలా భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు, కూలీలకు చేతినిండా 365 రోజులు పని దొరుకుతున్నది. సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నరు.
ఎమ్మెల్యే: గత ప్రభుత్వంలో పని చేశా.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేస్తున్నా. అప్పుడు చెప్పిన పనులు పూర్తి చేసే అవకాశం లేదు. ఇప్పుడు చెప్పని పనులు సైతం చేస్తున్నం. గతంలో ఎస్సారెస్పీ కాల్వలు అసంపూర్తిగా వదిలేశారు. చుక్కనీరు వచ్చే పరిస్థితి లేదు. పొలాలు బీడువడి పనులు లేక రైతులు పట్నం బాట పట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వం ప్రాజ్టెకును నిర్మించి, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గ్రామాలకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నరు. గతంలో వ్యవ సాయానికి ఏడు గంటల కరెంట్ ఇచ్చేది. అది కూడా పగలు 4 గంటలు, రాత్రి మూడు గంటలు ఇచ్చేవా రు. అది కూడా లో వోల్టేజీతో ఇవ్వడంతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయేవి. పంటలు ఎండి రైతులు ఇబ్బందిపడేది. ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నం. భగీరథ ద్వారా ప్ర తి ఇంటికీ శుద్ధి చేసిన జలాలు అందుతున్నాయి.
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దమ్మున నాయకుడు. ఒకేసారి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం చరిత్ర. నేను గతంలో ఉన్న పార్టీ(కాంగ్రెస్)లో 50 టికెట్లన్న ప్రకటించిన సందర్భాలు లేవు. డోర్నకల్ టికెట్ నీకే ఇస్తున్నా..ప్రజల్లో నీకు మంచిపేరు ఉందని సీఎం కేసీఆర్ 2 నెలల క్రితమే టికెట్ ఖరారు చేశారు. నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు.
ఎమ్మెల్యే: ప్రజల్లో మంచి స్పందన ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. పగలు, రాత్ర నే తేడా లేకుండా ప్రజలు ఎప్పుడొచ్చినా వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నా. గ్రామాలు, తం డాల్లో ఎక్కడి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నా రు. కొంత మంది గిట్టని వారు చిన్నచిన్న గొడలు చేస్తున్నారు తప్ప ప్రజలు నన్నుఅక్కున చేర్చుకుంటున్నారు.మళ్లీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. బీజేపీ, కాంగ్రెస్ కనుచూపు మేరలో కూడా లేవు.
ఎమ్మెల్యే : ఇప్పటికే నియోజకవర్గాన్ని పూర్తి స్థా యిలో అభివృద్ధి చేశా. నూతంగా ఏర్పడిన మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, నర్సింహులపేట, సీరోలులో పీహెచ్‌సీలు నిర్మించాల్సి ఉన్నది. అవి కూడా త్వరలోనే పూర్తి చేయిస్త. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్త.