క్షుద్రపూజలతో మోసాలు
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
- నకిలీ డాక్టర్ తండ్రి, కొడుకు అరెస్ట్
- రూ.3 లక్షల నగదు, కారు, అలోపతి మందులు స్వాధీనం
సుబేదారి, మార్చి 13 : క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండలోని రాంనగర్‌కు చెందిన పోలీసు సయ్యద్ ఖదీర్ అహ్మద్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ షబ్బీర్ అహ్మద్ తండ్రి కొడుకులు. వీరు ఫారహీన పేరిట దవాఖాన ప్రారంభించి, దాని ముసుగులో క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
పక్కా సమాచారంతో ఈ నెల 13వ తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు హాస్పిటల్‌పై దాడులు తండ్రీ కొడుకును అరెస్టు చేశారు. చేతబడి చేసిన వారికి తగ్గిస్తామని, సంతానం లేమి వారికి సంతానం కలిగేలా వైద్యం చేస్తామని, ఆరోగ్యం, ఉద్యోగ, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించారు. ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని క్షద్రపూజలతో మోసం చేసేవారు. వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకునేవారు. గతంలో ఓ డాక్టర్ వద్ద పనిచేసిన అనుభవంతో సయ్యద్ ఖదీర్ నకిలీ డాక్టర్‌గా నయీంనగర్ కేయూసీ రోడ్డులో ఫారహీన పేరుతో హాస్పిటల్ పెట్టి మోసాలకు పాల్పడ్డారు. తండ్రి, కొడుకుపై 447,427, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీసీ తెలిపారు. అలోపతి మందులు, క్షద్రపూజల సామగ్రి, ల్యాబ్ టెస్ట్ సామగ్రి, ఫోన్, టవేరా వాహనం, పేషెంట్ రిజిస్టర్, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌జీ, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సై లవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- arrest
- Black Magic
- Doctor
- fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

