హనుమకొండ చౌరస్తా : జూన్ 15న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-13 చెస్ పోటీలు జరగనున్నాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
2012 జనవరి 1 తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులని, క్రీడాకారులు తమవెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ పోటీల్లో గెలిచిన వారిలో బాలురు నుంచి నలుగురికి, బాలికల నుంచి నలుగురికి వచ్చే నెలలో హైదరాబాద్లో జరగబోయే రాష్ర్టస్థాయి చదరంగ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. మరిన్ని వివరాలకు 90595 22986 నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.